A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
Share |
August 26 2019, 2:36 pm

ఇక ఇప్పుడు ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రారంబించింది. ఏకంగా ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆయనపై ఒక ప్రకటన విడుదల చేశారు.
సీఎస్‌ నియామకాన్ని, నిర్ణయాలను ఓ ప్రకటనలో ఆయన తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్‌ సూచనలను యనమల విభేదించారు. నిధుల సమీకరణ, విడుదలలో మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్‌ అని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్‌ రూల్స్‌ అతిక్రమిస్తున్నారని విమర్శించారు. సీఎస్‌ మంత్రివర్గానికి సబార్డినెట్‌ అని అలాంటిది ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారనే యనమల అంటున్నారు.ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడం, వాటిని యదేచ్చగా ఖర్చు చేసిన తీరుపై ఎల్వి సుబ్రహ్మణ్యం ఆర్దిక శాఖ అదికారులను ప్రశ్నించిన నేపద్యంలో యనమల ఈ విమర్శలు చేశారు. కాగా గతంలో జగన్ పై పెట్టిన కేసులో అన్ని నిర్ణయాలు మంత్రివర్గం చేసినవే కాగా, వాటిని తప్పు పట్టిన చంద్రబాబు,యనమల వంటి నేతలు ఇప్పుడు తమ వరకు మాత్రం మంత్రి వర్గ నిర్ణయాలను ప్రశ్నించరాదని అంటున్నారు..అదండి రాజకీయం.

tags : yanamala

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info