A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
Share |
August 26 2019, 2:26 pm

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా లేవని నిందలు వేస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని, కావాలనే లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు సృష్టిస్తున్నారని చినరాజప్ప విమర్శలు గుప్పించారు. గుంటూరులో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో సమస్యలు తలెత్తినా టీడీపీ కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారని ఆయన అన్నారు. అయితే పోలింగ్‌ రోజు ఎన్నికల కమిషన్‌ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికలు కోడ్‌ అమల్లో ఉన్నా ప్రజల సమస్యలపై సమీక్షలు చేయవచ్చని చినరాజప్ప సమర్థించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని... ‘మా లెక్కలు మాకున్నాయి...ఖచ్చితంగా 115 నుంచి 120 సీట్లలో గెలుస్తాం.’ అంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.చంద్రబాబు మాదిరే మాట్లాడాలని చినరాజప్ప అనుకున్నట్లుగా ఉంది

tags : china rajappa

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info