A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
Share |
August 26 2019, 2:27 pm

తమిళనాడులో పట్టుబడిన 1400 కిలోల బంగారం విషయంలో పూర్తి వివరాలు వెల్లడి చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
బంగారం పట్టివేత వ్యవహారంలో ప్రజలు పూర్తి వివరాలను కోరుకుంటున్నారని చెప్పారు. సీజ్‌ చేసిన దాదాపు 1,400 కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సంబంధించిందనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. దీనిపై టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
‘‘భారీస్థాయిలో బంగారం పట్టుబడితే, అది టీటీడీది అని ఎస్పీ ధ్రువీకరిస్తే, ఇక్కడ ఈవో, చైర్మన్, అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? ఇందులో ఏం మతలబు ఉందో అర్థం కావడం లేదు. టీటీడీ బంగారాన్ని రక్షణ లేకుండా, ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? భక్తులు సమర్పించే బంగారం, నిధులకు లెక్కాపత్రం లేకపోవడం ఏమిటి? అనే సందేహాలు భక్తు ల్లో తలెత్తుతున్నాయి. అందుకే విచారణ జరపాలి’’ అని ఆమె అన్నారు.

tags : vasireddy padma

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info