A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
Share |
May 23 2019, 10:14 pm

మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు తీర్మానం చేయడానికి ఇబ్బంది ఉండదని వార్తలు వస్తున్నాయి.ఆ దిశగా టిఆర్ఎస్ పావులు కదుపుతోందని కధనాలు వస్తున్నాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరికకు సైతం రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల్లోపే కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిసింది. గతంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ ఎమ్మెల్యే త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోని ఒక్కరు చొప్పున ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే అధికార పార్టీలోకి మారే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోపే మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని అంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, జాజుల సురేందర్‌లు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని, కాంగ్రెస్‌ను వీడితున్నామని తెలిపారు.

tags : telangana

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info