A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
Share |
May 24 2019, 6:25 pm

జిఎస్టి పన్ను ఎగవేత, మోసం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న సుజనా గ్రూప్ సంస్థ ల డైరెక్టర్లను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. తమను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ కంపెనీల డైరెక్టర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టేసింది. ఇలాంటి కేసుల్లో అధికరణ 226 కింద హైకోర్టులు తమకున్న న్యాయ విచక్షణను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అంతేకాక దర్యాప్తులో అరెస్ట్‌ భాగమని పేర్కొంది. కాగితాలపై రూ.1,290 కోట్ల టర్నోవర్‌ చూపి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద రూ.225 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఈ ఆరుగురు డైరెక్టర్ల మీద ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్‌ చేయాలన్న సెంట్రల్‌ ట్యాక్స్‌ అధికారుల ఆలోచన తప్పుకాదని అభిప్రాయపడింది. తమను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుజనా గ్రూపునకు చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరాజు, హిందుస్థాన్‌ ఇస్పాట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.వెంకట సత్య ధర్మావతార్, ఇన్ఫినిటీ మెటల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ పి.వి.రమణారెడ్డి, ఈబీసీ బేరింగ్స్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణమూర్తి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

tags : highcourt

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info