A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
Share |
May 23 2019, 10:12 pm

ఒకపక్క స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్ ఆక్రమణ కేసులో ఇరుక్కుంటే ఆయన కుమారుడు శివరామకృష్ణ పైరసీ కేసులో చిక్కుకున్నారన్న వార్త వచ్చింది.శివరామకృష్ణ నిర్వహిస్తున్న కె చానల్ అక్రమంగా ఆయా టీవీ చానళ్ల కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని అభియోగాలను ఎదుర్కుంటోంది.దీనిపై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోకపోవడం తో డిల్లీ హైకోర్టు నుంచి స్టార్ టీవీ వారు ఆడ్వకేట్ కమిషన్ ను నియమించుకున్నారు.
ఈ ‘కే చానల్‌’కు ఈటీవీ, జెమినీ టీవీ ప్రసారాలకు మాత్రమే హక్కులు ఉన్నాయి. జీ, స్టార్‌ మా చానళ్లకు సంబంధించి ఆయా సంస్థల ద్వారా ఎలాంటి ప్యాకేజ్‌ అనుమతులు తీసుకోకుండా డీటీహెచ్‌ సన్‌ డైరెక్ట్‌ ద్వారా శాటిలైట్‌ పైరసీకి పాల్పడుతూ గత కొన్నేళ్లుగా వినియోగదారులకు ప్రసారం చేస్తున్నారు. స్టార్‌ మా ప్యాకేజీకి ప్రసార హక్కులు తీసుకొని ఉంటే ఒక్కో వినియోగదారుడి తరఫున రూ. 39, జీ ప్యాకేజీకి సంబంధించి రూ. 25 శివరామకృష్ణ చెల్లించాల్సి ఉంది. ఇలా ఒక్కో ఏడాదికి సుమారుగా రూ. 5.46 కోట్లతోపాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని పే చానళ్ల సంస్థ సభ్యులు చెబుతున్నారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని శివరామ్‌ డీటీహెచ్‌ ద్వారా సాంకేతికపరమైన నేరానికి పాల్పడుతున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని గమనించిన స్టార్‌ ప్లస్‌ ప్రతినిధులు రెండేళ్ల కిందట టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు స్పీకర్‌ కుమారుడు కావటంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం శాటిలైట్‌ పైరసీపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ సభ్యుల బృందం గురువారం నరసరావుపేటలోని స్పీకర్‌ కోడెల క్యాంపు కార్యాలయంలోని కే చానల్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. టూటౌన్‌ పోలీసుల సహకారంతో శాటిలైట్‌ పైరసీకి వినియోగించిన ఎన్‌కోడర్, సెట్‌ టాప్‌ బాక్స్‌లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో సీజర్‌ నామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టులో సమర్పించేందుకు తమ వెంట తీసుకెళ్లారు.

tags : ap,kodela

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info