A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
Share |
August 26 2019, 2:26 pm

ఎన్నికల ముందు నుంచే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎన్నికల సం‍ఘంపై బెదిరింపులకు పాల్పడిన బాబు.. అవేవీ ఫలితం ఇవ్వకపోవడంతో ఎన్నికల అనంతరం ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తూ ప్రజలకు ఈసీపై తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, వాటిని హుందాగా స్వీకరించాల్సింది పోయి ఎన్నికల వ్యవస్థను తప్పుపట్టడం సరికాదన్నారు.
‘సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకే పోతుందన్న మీరు.. నిన్నా ఇవాళ టీడీపీకి 130 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. మీ ఓటమి నిశ్చయమై జైలుకు పోవాల్సి వస్తే కాపాడుకునేందుకే కేంద్రంలో వివిధ పార్టీలతో ఇప్పుడు కలుస్తున్నారా? మీరిచ్చిన హామీలను గుర్తు చేసుకునే ప్రజలు ఓటేశారు. మీరు చేసిన నమ్మకద్రోహాన్ని గుర్తుంచుకుని మరీ ఓటేశార’ని వీరభద్రస్వామి అన్నారు.

tags : kolagatla

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info