A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డేటా చౌర్యం కేసు- దేశ భద్రతకే ప్రమాదం
Share |
April 21 2019, 11:32 pm

ఐటి గ్రిడ్స్ డేటా చౌర్యం కేసులో దేశ భద్రతకు సంబందించిన అంశం కూడా ఇమిడి ఉందని ఆదార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ భవాని ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్న తీరు సంచలనంగా ఉంది. ‘యూనిక్‌ ఐడీ(ఆధార్‌) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్‌ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్‌ కోసం లింక్‌ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్‌ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.

tags : aadhar

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info