A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు 1001 అబద్దాలు ఆడారు
Share |
April 21 2019, 11:35 pm

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతటా కొన్ని వేల చిన్న, పెద్ద సభలు పెట్టి 1,001 అపద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రతిఫలంగా వచ్చే నెల 23న వెలువడే ప్రజాతీర్పు వైఎస్సార్‌సీపీ గెలుపు కాబోతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు..‘ఎన్నికలు జరిగిన రోజు నుంచి చంద్రబాబు మానసిక మార్పును గమనిస్తే చిత్ర, విచిత్ర వేషధారణలా ఉంది. ప్రపంచదేశాల్లోనే 133 కోట్ల జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశంలో భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ మచ్చలేకుండా ఎన్నికల కమిషన్‌ చక్కగా ఎన్నికలు నిర్వహిస్తుందని దేశ, విదేశాలు కొనియాడుతుంటే చంద్రబాబు అదే ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టడం హాస్యాస్పదం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చాంబర్‌కు వెళ్లి ఎన్నికల కమిషనర్‌పై.. అదే ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరం. చాంబర్‌ నుంచి బయటకు వచ్చి మెట్ట మీద కూర్చోవడం ఇవన్నీ విచిత్ర వేషధారణలా కన్పిస్తున్నాయి. మరోవైపు తాను వేసిన ఓటు తన పార్టీ సింబల్‌కే పడిందో లేదో అర్థం కావడం లేదంటున్నారు.హైటెక్నాటజీ మేధావిగా చెప్పుకునే చంద్రబాబు హైటెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఓటు వేస్తే.. వారు ఏ పార్టీ సింబల్‌కు ఓటు వేశారో వీవీప్యాడ్స్‌లో ఏడు సెకన్లు డిస్‌ప్లే అవుతున్నా.. అది కూడా గ్రహించలేకపోవడం విడ్దూరం. అని ఆయన అన్నారు. మే ఇరవైమూడున చంద్రబాబు ఓటమి, జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చల్లా పేర్కొన్నారు.

tags : challa

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info