A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తొత్తులు ఎస్పిలుగా ఉన్న చోటే..
Share |
April 22 2019, 12:06 am

చంద్రబాబు కుట్రల వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికలలో హింసపై వైసిపి బృందం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మాట్లాడుతూ వీవీప్యాట్‌ పనిచేయకుంటే ఓటు వేసిన రోజే బాబు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘ఆరోజు పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకొచ్చి ఓటు వేసినట్టు వేలు కూడా చూపించారు. కుటుంబ సభ్యులతో కలిసి నవ్వులు చిందించారు. మరి అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్న జిల్లాల్లోనే లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే సరిచేశారు. 130 స్థానాల్లో గెలుస్తా అంటారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని పొంతన లేకుండా మాట్లాడతారని ఆయన ఎద్దేవ చేశారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info