A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ డిజిపికి లక్ష్మీపార్వతి ఫిర్యాదు
Share |
June 16 2019, 2:45 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీపార్వతి తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డికి పిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా కోటి అనే వ్యక్తి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని , ఆ ప్రచారాన్ని టివి 5,ఎబిఎన్ చానళ్లు ప్రసారం చేశాయని ఆమె తెలిపారు.ఎన్.టి.ఆర్.బార్యను అయిన తనపట్లే ఇంత అమానుషంగా వ్యవహరిస్తే, ఇతర మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఏప్రిల్ 4వ తేదీన తప్పుడు ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిత్వాన్ని కోటి కించపరిచారని ఆమె చెప్పారు. అతనితో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్‌‌, యాంకర్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు లక్ష్మీపార్వతి చెప్పారు.

tags : lakshmi parvati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info