A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓడినా నేనే సి.ఎమ్.అని చంద్రబాబు తిరుగుతారా
Share |
April 21 2019, 11:32 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత సొంతంగా ఎక్కడో చోట ప్రమాణం చేసుకుని తానే సి.ఎమ్.నని చెప్పుకునే తిరిగేలా ఉన్నారని మాజీ మంత్రి,వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఎద్దేవ చేశారు. చంద్రబాబు హుందాగా ఉండవలసిన సమయంలో ఇలా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా కేసు వేసి అప్రతిష్ట పాలు చేయడానికి యత్నించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తో కలిసి చంద్రబాబు తిరగడం దారుణంగా ఉందని ఆయన అన్నారు.మరో వైపు ఎపి ప్రజల ఆధార్ కార్డు డేటా అంతా చోరీ అయిందని , ఆధార్ సంస్థ పిర్యాదు చేసిందని, ఇది సాదారణ నేరం కాదని, దేశ ద్రోహం కేసు అవుతుందని ఆయన అన్నారు. ప్రజలు వ్యక్తిగత సమాచారం ఎందుకు దొంగిలించారు. ఎవరికి అమ్మడానికి చోరీ చేశారని దాడి ప్రశ్నించారు. ఈ డేటా చోరీ కేసును పూర్తిగా విచారించాలని , ఈకేసు వెనుక ఉన్న రాజకీయ నేతలను కూడా బయటపెట్టాలని ఆయన అన్నారు.చంద్రబాబు ఈ డేటా తన పార్టీకి చెందినదని చెప్పినా, ఆదార్ సంస్థ అది ప్రభుత్వ సమచారం అని పిర్యాదు చేసిందని ఆయన అన్నారు. లోకేష్ ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని దాడి అన్నారు.వీరిద్దరూ దేశ ద్రోహ నేరానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

tags : dadi

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info