A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంజాగుట్టలో టిడిపి నేతలపై మరో కేసు
Share |
June 16 2019, 2:00 am

ఇది కొంచెం అశ్చర్యంగానే ఉంది. ఒక రవాణా వ్యాపారి రవికాంత్ హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో తనకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మనుషుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పిర్యాదు చేశారు. పార్టీ ఫండ్ గా ఎనిమిది కోట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారట. చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, ఆయన అధికారిక నివాసం ల్యాండ్‌లైన్‌ నుంచే ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారంలోపు తాము డిమాండ్‌ చేసిన రూ.8 కోట్లు చెల్లించకపోతే కుటుంబంతో సహా హతమారుస్తామంటూ బెదిరిస్తున్నారు. వీరి ఆగడాలు మితిమీరడంతో సదరు వ్యాపారి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.గతంలో టిడిపికి చెందిన ఈయనను ఆ పార్టీవారే బెదిరిస్తున్నారని కేసు నమోదు కావడం విశేషం.

tags : police, funds

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info