A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయప్రద ఖాకీ నిక్కర్ వేసుకున్నారు..
Share |
June 16 2019, 2:47 am

ఉత్తరప్రదేశ్ లో ప్రముఖ నటి, మాజీ ఎమ్.పి జయప్రదకు, మాజీ మంత్రి,సమాజవాది పార్టీ నేత అజంఖాన్ కు మద్య గొడవ సాగుతూనే ఉంది. మళ్లీ అజంఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కదనం వచ్చింది.అజంఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్‌ ఓ ఎన్నికల సభలో పేర్కొన్నారు.దీనిపై మహిళా కమిషన్ అద్యక్షురాలు రేఖా శర్మ స్పందించారు. జయప్రదను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అగౌరవకరంగా ఉన్నాయని ఆమె అన్నారు. అతి త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు. జయప్రద బిజెపి లో చేరిన నేపద్యంలో ఆర్ఎస్ఎస్ సంబందాలను దృష్టిలో ఉంచుకుని అజంఖాన్ ఈ నిక్కర్ వ్యాఖ్య చేశారు.

tags : azamkhan,jayaprada

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info