A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్,జగన్ లకు చంద్రబాబు రిటర్న్ గిప్ట్ ...
Share |
June 16 2019, 2:02 am

కేసీఆర్‌, జగన్‌లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారని కడప జిల్లా మైదుకూరు టిడిపి అభ్యర్ది, టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు.టిడిపి 150 సీట్లు గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని, ఈ సారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయన చెప్పారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌లు కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీసీలకు తెరాస అడుగడుగునా అన్యాయం చేసినా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నోరుమెదపని, కేసీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జగన్‌ను వెనకేసుకొస్తున్నారని ఆయన అన్నారు. తలసాని ఈయనకు వియ్యంకుడు కావడంతో తెలుగుదేశం పార్టీ ఈ ప్రకటన ఇప్పించినట్లుగా ఉంది. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తలసాని విమర్శించిన సంగతి తెలిసిందే.

tags : putta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info