A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతికి పాల్పడితే స్థానిక ఎన్నికలలో అనర్హులే
Share |
June 16 2019, 2:50 am

మండల పరిషత్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. అభ్యర్థుల అనర్హత నిబంధనలను ఖరారుచేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లోని 210లో పలు సెక్షన్లను అనుసరిస్తూ ఈ నిబంధనలను విధించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టాన్ని అనుసరిస్తూ అనర్హతలను ఖరారుచేశారు. ఇందులో భాగంగా అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోకుండాచేశారు. ప్రభు త్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధీనంలో ఉండే కార్యాలయాల్లో పనిచేస్తూ లం చం తీసుకున్నా లేదా ఇతర మోసాలకు పాల్పడినా.. విశ్వాసఘాత నేరాల కింద.. ఉద్యోగులైనా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టంచేశారు. అవినీతి, ఆరోపణలపై తొలిగించబడినవారు ఐదేండ్ల కాలపరిమితి వరకు అనర్హులని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటివరకు పలు పదవుల్లో, ప్రజాప్రతినిధులుగా ఉండి, అవినీతి, ఆరోపణలు రుజువై పదవుల నుంచి తొలిగించబడినవారు కూడా పోటీకి అనర్హులే. లంచాలకు, దుష్ప్రవర్తనకు పాల్పడినా.. అలాంటి వాటిలో ప్రమేయం ఉన్నట్టు రుజువైనా ఆరేండ్ల వరకు పోటీచేయరాదు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో విధుల నిర్వహణ, కార్యాచరణలో విఫలమైన సందర్భాల్లో పదవి నుంచి తొలిగించబడిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పోటీచేసేందుకు అనర్హులు.గా తెలంగాణ కొత్త నిబందనలు రూపొందించడం విశేషం.

tags : telangana, local body electons

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info