A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును మోడీ పెంపుడు కుక్క అనం..
Share |
June 16 2019, 2:03 am

ఎన్నికల ప్రచారంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి మాట్లాడారని టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ అన్నారు . కేసీఆర్‌, జగన్‌లు మోదీ పెంపుడు కుక్కలని అన్నారని, నాలుగేళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము అలా మాట్లాడం అని ఆయన అన్నారు. కేసీఆర్‌, జగన్‌ హుందాగా వ్యవహరించారు. ప్రజలపట్ల నమ్మకం లేకే బాబు దిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారు. ప్రజాతీర్పును స్వాగతించాలి కానీ ఇలా గగ్గోలు పెట్టొద్దు. ఈవీఎంలపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 2014లో ఇదే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని ఆయన మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఒకవేళ గెలిస్తే ఈవీఎంల గురించి ఏం మాట్లాడుతారు? గెలిస్తే సాంకేతికత భేష్‌ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అనడం సరికాదు. 40ఏళ్ల అనుభవమని చెప్పుకుంటున్న వ్యక్తి ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదని కెటిఆర్ పేర్కొన్నారు.

tags : ktr, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info