A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరిప్రసాద్ కు టిడిపి మీడియా ప్రచారం
Share |
June 16 2019, 2:51 am

ఈవిఎమ్ ల దొంగతనం కేసులో నిందితుడు అయినందున ఎపి ప్రభుత్వ సలహాదారు వేమూరి హరి ప్రసాద్ ను తమ వద్దకు పంపవద్దని ఎన్నికల సఃంఘం స్పష్టం చేసిన నేపద్యంలో టిడిపి మీడియా దానిపై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది.ఒక పత్రిక ఎన్నికల సంఘాన్ని అంతా తప్పు పడుతున్నారని రాస్తే, మరో పత్రిక హరి ప్రసాద్ తో ఇంటర్వ్యూని ప్రచురించింది.ఆయన ఈవిఎమ్ లు లోపాలతో ఉన్నాయని వాటిని హాక్ చేసేందుకు అవకాశం ఉందని చెప్పిన విషయాలను ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 11న పోలింగ్‌ సందర్భంగా ఈ విషయం రుజువైందని తెలిపారు. ఓటు వేశాక వీవీప్యాట్‌లో 7 సెకన్లపాటు కనిపించాల్సిన స్లిప్‌ 3 సెకన్లే కనిపించిందంటే ఎక్కడో తేడా జరిగినట్టేనని, కోడ్‌ మారి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ విధానానికే వెళ్లడం మంచిదని ఆయన అన్నారు.2014లోనూ ఈసీ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించింది. వాళ్లు వీవీప్యాట్‌లను పెట్టేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈవీఎంలకు అభ్యంతరం చెప్పలేదని ఆయన వివరణ ఇస్తున్నారు.

tags : tdp, hariprasad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info