A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇవి విఫల ఎన్నికలంటున్న టిడిపి మంత్రి
Share |
April 22 2019, 12:06 am

మొత్తం మీద ఈ ఎన్నికలు టిడిపి నేతలకు ముచ్చెమటలు పట్టించాయనుకోవాలి. ఆ నేతల వ్యాఖ్యలు చూస్తే అలా అనిపిస్తుంది.తాను 16 సార్లు ప్రత్యక్ష, పరోక్ష రీతిలో ఎన్నికల్లో పాల్గొన్నానని ఎప్పుడూ ఈ తరహాలో పోలింగ్‌ జరగలేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఇవి పూర్తిగా విఫలమైన ఎన్నికలని, అత్యంత బాధ్యతారాహిత్యంగా నిర్వహించారని విమర్శించారు. ఈవీఎంలు తరచూ మొరాయించాయని, సగం ఓటింగ్‌ జరిగాక మరో యంత్రాన్ని మార్చారని అన్నారు. ఇందులో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. వరుసల్లో నిలబడిన వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తామే గెలుస్తామని చెబుతో, టిడిపి నేతలంతా ఇలా మాట్లాడుతున్నారు.

tags : achhennaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info