A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు వంగి,వంగి దండాలు పెట్టినప్పుడే..
Share |
June 16 2019, 2:22 am

తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండాఎన్నికలు జరిగాయని, అది తెలంగాణలో పాలనకు నిదర్శనమని, ఎపిలో ఎన్నికల తీరు అక్కడి ప్రభుత్వ పనితీరుకు దర్పణమని టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు చూసి అంతా నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. తాను గెలిస్తే సాంకేతిక బాగున్నట్లు ,ఇంకెవరైనా గెలిస్తే ఈవి ఎమ్ లు లోపాలు ఉన్నట్లా అని ఆయన అన్నారు. ఎపిలో ప్రజలు ఆయనను సాగనంపనున్నారని, ఆ భయంతోనే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకుని హుందాగా ఉండడం మంచిదని ఆయన అన్నారు.వంగి,వంగి దండాలు పెట్టినప్పుడే బాబు పని అయిపోయిందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కొద్ది మంది అదికారులను బదిలీ చేస్తే దానికి చంద్రబాబు ఎందుకు డిల్లీలో వీదిపోరాటాలు చేస్తున్నారని, ప్రజలపై నమ్మకం ఉంటే అలా చేస్తారా అని ఆయన అన్నారు.నలభై ఐదేళ్ల వ్యక్తి హుందాగా ఉంటే, నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి చిల్లరగా వ్యవహరిస్తున్నారని ప్రజలంతా చూస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

tags : ktr, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info