A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై ఛీఫ్ సెక్రటరీ దావా వేస్తారా
Share |
June 16 2019, 2:24 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎపి ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం పరువు నష్టం దావా వేయవచ్చని ఒక కదనం వచ్చింది.ఎన్నికల కమిషన్ సుబ్రహ్మణ్యం ను చీప్ సెక్రటరీగా నియమించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఏకంగా సుబ్రహ్మణ్యంపై కేసుల ఉన్నాయని, జగన్ సహనిందితుడని ఆరోపించారు. దీనిపై ఐఎఎస్ లు, రిటైర్డ్ ఐఎఎస్ లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని,ఆయన ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేయకుండా ఉండాలంటే చట్టపరంగా దావా వేయాలని సుబ్రహ్మణ్యానికి సూచిస్తున్నారు.ఎమ్.ఆర్.కేసులో సుబ్రహ్మణ్యంపై వచ్చిన అబియోగాలను హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా చంద్రబాబు ఇంత దారుణంగా మాట్లాడతారా అని అదికారులు మండిపడుతున్నారు.ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రిపై దావా వేస్తే అది సంచలనమే అవుతుంది.

tags : ap, lv, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info