A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెలది క్రిమినల్ మనస్తత్వం
Share |
June 16 2019, 3:17 am

స్పీకర్ కోడెల శివప్రసాదరావే ప్రజలను రెచ్చగొట్టారని, ఆయనపై కేసు పెట్టకుండా ప్రజలపై కేసు పెట్టడం ఏమిటని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది, సత్తెనపల్లి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబ్యర్ధి అంబటి రాంబాబు ప్రశ్నించారు.ప్రశాంతంగా ఉండే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఫ్యాక్షన్‌ సంస్కృతిని తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఇనిమెట్ల సంఘటనలో ప్రధాన ముద్దాయి కోడెలే కాని ప్రజలు కాదన్నారు. తాను, బాసు లింగారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ ముగ్గురం కలిసి కుట్రచేసి కోడెలపైకి ఇనిమెట్లలో ప్రజలను ఉసిగొల్పామని టీడీపీ వారు ఫిర్యాదు చేశారన్నారు. తమపై ఇంతకుముందు ఎలాంటి ఎన్నికల కేసులూ లేవని.. కానీ, కోడెల చరిత్ర అంతా బూత్‌లు ఆక్రమించుకోవడం.. అధికారులను, ఓటర్లను బెదరించడం వంటి వాటిల్లో ఆయనపై కేసులున్నాయన్నారు.ఎన్నికల సమయంలోనే నరసరావుపేటలో ఆయన ఇంట్లో బాంబులు కూడా పేలాయని గుర్తుచేశారు. ఒక క్రిమినల్‌ సంస్కృతి కలిగిన వ్యక్తి కోడెల అని.. గెలుపు కోసం ఆయన ఎంతకైనా తెగించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అంబటి విమర్శించారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info