A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కూడా ఫిర్యాదు చేయలేదుగా
Share |
June 16 2019, 2:26 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు తనకు పడిందో లేదో అని అనడం అర్దరహితం అని, మాజీ ఎమ్మెల్సీ , ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని చంద్రబాబు అనడం సరైంది కాదు. అలాగైతే అప్పుడే పోలింగ్‌ అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఒక్క చంద్రబాబే కాదు... లక్షలాది మంది ఓటర్లు ఓట్లేశారు. వారిలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వారెవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఓటు ఎవరికి వేశారో తెలియకపోతే పోలింగ్‌ బూత్‌ల వద్ద అలజడులు జరిగేవి. అలా జరగలేదంటే పోలింగ్‌ సక్రమంగా జరిగినట్లే కదా. ఈవీఎంలపై సందేహాలుంటే 2014 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా ఒక్కసారైనా ఆ విషయాన్ని టీడీపీ ప్రస్తావించిందా? పార్లమెంటులో లేవనెత్తిందా? చంద్రబాబు ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయిని నాగేశ్వర్ అన్నారు.

tags : ap,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info