A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై కేసు పెట్టాలన్న మాజీ ఐఎఎస్
Share |
June 16 2019, 3:19 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎమ్ ల పై వ్యవహరిస్తున్న తీరును , ఛీప్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంపై చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అదికారి ఈ ఎ ఎస్ శర్మ తప్పు పట్టారు.రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం అని ఆయన అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని భావించిన కొందరు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. నిరాధార ఆరోపణలు చేసిన నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్ చేశారు.చంద్రబాబుపై క్రిమినల్ కేసు,పరువు నష్టం దావా వేయాలని ఆయన ఎన్నికల సంఘానికి సూచించారు.

tags : eas sarma

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info