A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈసి రావణాకాష్టం చేసిందట-బాబు ఊవాచ
Share |
April 22 2019, 12:34 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. ఎ పి ని ఎన్నికల సంఘం రావణాకాష్టం చేసిందని ఆయన అంటున్నారు.ఎన్నికల వేళ ఇష్టప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చారని ఆయన ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఈసీ చెబుతోందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీ సూచనల మేరకే ఈసీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు రావణా కాష్టం అని అంటున్నారంటే,అందుకు ఆయనే బాద్యుడవుతారన్న సంగతి ఆయనకు అర్దం కావడం లేదా!

tags : chandrababu, ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info