A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓటమి అర్దం అయ్యే చంద్రబాబు వితండం
Share |
June 16 2019, 2:50 am

ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టే వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు,బిజెపి నేత జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదని అన్నారు. నరేంద్ర మోదీ మాట ఎన్నికల కమిషన్ విన్నట్లయితే మోదీ బయోపిక్ విడుదలను ఎందుకు నిలుపుదల చేస్తోందని ప్రశ్నించారు.
ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నరని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info