A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భూమా అఖిలప్రియపై గంగుల విమర్శలు
Share |
June 16 2019, 3:01 am

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి ఆరోపించారు. మంత్రి అఖిల ప్రియా తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ టీడీపీ కండువా వేసుకుని, వాహనం మీద స్టిక్కర్‌ వేసుకుని పోలింగ్‌ బూతులోకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్లు వేసే సమయంలో అఖిల ప్రియ ఫోటో స్టికర్‌ ఓటర్లకు పంపించి ఓట్లు టీడీపీకి వేసిన తర్వాత రూ.2 వేలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఎలక్షన్‌ కమీషన్‌ సరిగ్గా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించలేదని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల పోలింగ్‌ శాతాన్ని తగ్గించడానికి ఎంతగానో ప్రయత్నించారని ఆరోపించారు. ఆళ్లగడ్డ అభివృద్ధిలో పోటీ పడతాం తప్ప, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వమని గంగుల వ్యాఖ్యానించారు.

tags : gangula

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info