A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తొత్తుల్ని పెట్టుకోవాలని బాబు చూశారు
Share |
April 22 2019, 12:23 am

ఎపి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్మణ్యంపై సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఉద్దేశించి నిందితుడు అనడం తీవ్ర తప్పిదమని ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ‘‘హైకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తర్వాత ఎవరూ నింది తుడు అనడానికి వీలులేదు. సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అబద్ధాలు చెప్పి నిందారోపణలు చేయడం తగదు. అసాధారణ పరి స్థితుల్లో పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు వెళ్లి సమీక్షిం చడమనేది సీఎస్‌ బాధ్యతల్లో ఒకటి. బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వర్తించారే తప్ప ఎలాంటి తప్పులేదు ’’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు తొత్తుల్లా పనిచేయకుండా నిరాకరించే వారంతా ఆయన దృష్టిలో కోవర్టులా? అని రిటైర్డు ఐజీ ఎ. సుందర్‌ కుమార్‌ దాస్‌ ప్రశ్నిం చారు. ‘‘ఆయన కంటే కోవర్టులను పెట్టుకునేవారు దేశంలో ఎవ రైనా ఉన్నారా? ఎల్వీ సుబ్రహ్మ ణ్యంను పక్కన పెట్టి జూని యరైన పునేఠాను సీఎస్‌గా ఎందుకు పెట్టా రు? తాను చెప్పి నట్టల్లా ఆడు తూ ఫైల్‌లో ఎక్క డ పెట్ట మంటే అ క్కడ సంతకం పె ట్టే వారే బాబు దృ ష్టిలో నిజాయతీపరు లైన అధి కారులా?’’ అని ప్రశ్నించారు.

tags : iyr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info