A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను గెలవబోతున్నా-కేంద్ర మాజీ మంత్రి
Share |
April 22 2019, 12:35 am

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తన విజయం పై దీమా వ్యక్తం చేశారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వంపైన, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపైన ప్రజలలో వ్యతిరేకత ఉందని ఆమె చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో అది నిరూపితమవుతుందని ,అందువల్ల తాను ఖమ్మం నుంచి లోక్ సభకు గెలుస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున డబ్బు పంపిణీ చేసిందని, అయినా జిల్లా ప్రజలు డబ్బు రాజకీయాలకు, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని, తనను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆమె జోస్యం చెప్పారు.

tags : renuka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info