A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు.. ఏమిటీ ఈ ఏడుపు
Share |
April 22 2019, 12:10 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదిక గా వ్యంగ్యాస్త్రాలు సందించారు. ’చంద్రబాబు...! అసలు ఈవీఎం కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా!. వీవీ ప్యాట్‌లో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?. ఓ‍టమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకోవడం లేదని గ్రహించు. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారు.’ అని ఆయన అన్నారు.
‘యూ టర్న్ బాబు, ఈవీఎంల విషయంలో ఆడలేక మద్దెల ఓడు లాగా ఉంది నీ వ్యవహారం.. సిగ్గు లేకుండా అవినీతి చేసి బుకాయించడం, రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకం లేకపోవడం, గుడ్డ కాల్చి పక‍్కన వాళ్లమీద వేయడం, ఎన్నికల అయిపోయినా ఇంకా ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ పిచ్చి వేషాలు. ఓటమి భయం నిన్ను మరింత దిగజారేలా చేస్తోంది.’ అని కూడా కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

tags : kanna,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info