A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ నటి సంగీత , ఆమె తల్లి మద్య వివాదం
Share |
April 21 2019, 11:34 pm

ప్రముఖ నటి సంగీత కు ,ఆమె తల్లి భానుమతి మద్య వివాదం రోడ్కెక్కింది. తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని కుమార్తె బలవంతం చేస్తోందని భానుమతి తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని దోచేయాలనే ఉద్దేశంతో సంగీత ఇలా చేస్తోందని ఆరోపించారు.సోషల్ మీడియాలో సంగీతపై వ్యతిరేక ప్రచారం వస్తుండడంతో ఆమె స్పందించారు. తన తల్లి భానుమతి ఖాళీ చెక్కులపై తనతో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాక అమ్మను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ తనను ఎలా చిన్నతనం నుంచి ఎలా వేదించింది వివరించే యత్నం చేసింది. కొంత వ్యంగ్య భాషలో ఆమె వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది.తనను కన్నందుకు ధన్యవాదాలు అంటూ నన్ను పాఠశాలకు దూరం చేసి, 13 ఏళ్ల వయసు నుంచే పని చేయించినందుకు కృతజ్ఞతలు. నాతో ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించినందుకు థాంక్స్‌. మద్యం, డ్రగ్స్‌కు బానిసై, జీవితంలో ఏ రోజూ పనికి వెళ్లని నీ కుమారుడి సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు ధన్యవాదాలు. నీ నిర్ణయాలకు అడ్డు రాకుండా మన సొంత ఇంటిలోనే నన్ను ఓ మూలన ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను పోరాడే వరకూ నాకు పెళ్లి చేయకుండా ఉన్నందుకు థాంక్స్‌. నన్ను, నా భర్తను నిరంతరం వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు ధన్యవాదాలు. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. చివరిగా.. నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్‌.అని ఆమె అన్నారు. ఇప్పుడు తనను ఒక పోరాట మహిళగా మార్చిందని సంగీత పేర్కొన్నారు.

tags : sangeeta

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info