A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిత్యాన్న దానానికి పవన్ కళ్యాణ్ విరాళం
Share |
June 16 2019, 2:00 am

ఒక ఆలయానికి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు.
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల దశావతార వెంకన్న స్వామి దేవస్థానాన్ని ఆయన దర్శించారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దశావతార వెంకన్న సన్నిధిలో నిత్యాన్నదాన పథకాన్ని పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదానం కోసం రూ. 1.30 కోట్లు విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు, ధర్మకర్తలు లింగమనేని పూర్ణ భాస్కరరావు, స్వర్ణకుమారి, లింగమనేని రాజశేఖర్‌, లింగమనేని రమేష్‌, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info