A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
Share |
April 20 2019, 2:43 am

తెలంగాణ నుంచి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ఆంద్రావాళ్లు దొంగలు అన్న కెసిఆర్ తో జగన్ ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు.కెసిఆర్ కు జగన్ మద్దతు ఇస్తుంటే రక్తం ఉడికిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రజలు దేశంలో పౌరులు కాదా.. మనకు రోషం లేదా?. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఏపీలో వచ్చి పోటీ చేయాలి. సాగర్‌ నుంచి మనకు రావాల్సి నీళ్లు రానివ్వడం లేదు. ఆంధ్రా ప్రజలు జగన్‌ను క్షమించరు. ప్రాణాలైన పొగొట్టుకుంటాం కానీ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం. కేసీఆర్‌..రాజధాని శంకుస్థాపనకు వచ్చి 500 కోట్లు ఇవ్వాలనుకున్నాడట. మీ ముష్టి అక్కర్లేదు.. మాకు రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వండి. ’’ అని చంద్రబాబు అన్నారు. అయితే అడిగినవాటికి సమాదానం చెప్పకుండా చంద్రబాబు ప్రజలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నారు.కెసిఆర్ తో పొత్తు కోసం ఎందుకు ప్రయత్నం చేసింది ,హరికృష్ణ శవం వద్ద కెటిఆర్ తో పొత్తు బేరాలాడింది ఎందుకో చెప్పకుండా జగన్ పై విమర్శలు చేస్తున్నారు..

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info