A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మెదక్ లో హరీష్ రావు ప్రచారం
Share |
April 22 2019, 12:35 am

భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎమ్.పిగా కొత్త ప్రభాకర్‌ రెడ్డి గెలవబోతున్నారని మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు జోస్యం చెప్పారు. రోజుకొక నాయకుడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.తెలంగాణా ప్రజలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్చూచిగా తెలంగాణా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లకు ఓటు వేసి ఢిల్లీ చుట్టూ తిరుగుడు అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే కేంద్ర నిథులు ముక్కు పిండి రాబట్టవచ్చునని అన్నారు. వచ్చే నెల 3న నర్సాపూర్‌లో కేసీఆర్‌ సభ ఉందని, అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.

tags : harisha rao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info