A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
Share |
April 22 2019, 12:23 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళ్లారు. తాను చేసిన పనుల గురించి ,గత ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాల గురించి ప్రస్తావించకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారు.అందులోనే ఆయన బలహీన త కనిపిస్తుంది.గతసారి కూడా ఇదే వైఖరి అవలంబించి ప్రజలను తప్పుదారి పట్టించడానికి విశ్వయత్నం చేశారు.తనకు అండగా ఉంటే మీడియా ద్వారా విష ప్రచారం చేయించారు.ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు. రాజకీయం ఎంత దుర్మార్గం గా చేయవచ్చో చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చు. రాజకీయాన్ని ఎంత నీచంగా నడపవచ్చో చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందితే అర్దం అవుతుంది.జగన్ వస్తే వీదికో రౌడీ వస్తారట. పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకోరట.సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నది అదే కదా?ఎపిలో పోలీసులు ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నది ఇంత కాలం చూశాం.ఈ ఐదేళ్లలో హత్యలకు గురైనవాళ్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారా? టిడిపి వారా? కర్నూలు, అనంతపురం జిల్లాలలో జరిగిన హత్యలలో మరణించింది ఎవరు.చెరుకులపాడు నారాయణరెడ్డిని చంపింది ఎవరు? విజయభాస్కరరెడ్డిని కిరాతకంగా హతమార్చింది ఎవరు?విశాఖలో భూమి మాఫియా ను తయారుచేసింది ఎవరు. స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే విశాఖలో భూముల మాయం గురించి పిర్యాదు చేశారే. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే కనీసం కూడా కేసులేదే?పైగా సిసిటీవీ పుటేజీ మాయం చేసింది ఎవరు? అంతకన్నా పెద్ద నేరం ఏమి ఉంటుంది?ఎపిలో పోలీసులు,ప్రత్యేకించి ఇంటెలెజెన్స్ అదికారి ఎబి వెంకటేశ్వరరావు పేరు నేరుగానే రాజకీయ పార్టీలు ప్రస్తావించి విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎపిలో అరాచకం ఉన్నట్లా?లేక అంతా బాగున్నట్లా?గతంలో కూడా చంద్రబాబు ఇదే తరహాలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రచారం చేశారు.1999లో కొంత లాభం పొందారు.కాని ఆ తర్వాత 2004 లో రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ను విజయపదాన నడిపించారు.ఇప్పుడు 2014 లో జగన్ పై జరిగిన విషప్రచారం కొంత ప్రబావితం చేసింది.కాని ఇప్పుడు దానిని జనం నమ్మడం లేదనడానికి ఆయన సభలకు తరలి వస్తున్న వేలాది మంది జనమే తార్కాణం.మండుటెండలో సైతం నిలబడి జగన్ ప్రసంగాలు వింటుండమే పెద్ద నిదర్శనం.అయినా తెలుగుదేశం మీడియా కావాలని పాత విషయాలను వండి వడ్డిస్తోంది.అదే చంద్రబాబు నోటు కు ఓటు కేసులో పట్టుబడి తే ఒక్కసారి అయినా ఎల్లో మీడియా చెప్పదే. అంతదాకా ఎందుకు దర్మవరం ఎమ్ఎల్యే వరదాపురం సూరి ఏమి చెప్పారు..తెలుగుదేశం పార్టీని గెలిపించండి..ఆ తర్వాత ఆరు నెలలు మీ ఇష్టం..ఎవరినైనా చంపుకోండి.నరుక్కోండి అని చెప్పిన వీడియో కళ్లెదుటే ఉంది కదా..ఇక చింతమనేని ప్రభాకర్ అరాచకాల గురించి వేరే చెప్పాలా?ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదా?మరో వైపు ఐటి గ్రిడ్స్ కేసులో నిందితుడిని ఎందుకు ప్రభుత్వ పెద్దలే రహస్యంగా ఉంచుతున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.అవే కాదు. కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి బ్యాంకులకు ఆరువేల కోట్లు, జిఎస్టికి 500కోట్లు ఎగనామం పెడితే ఆయన టిడిపికి స్టార్ కాంపెయినర్.మరో టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వందల కోట్ల మోసంలో ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయే..ఒకవైపు తన పైన,తన పార్టీవారిపైన ఉన్న మచ్చలను పక్కన బెట్టి,అవి ప్రచారం కాకుండా జాగ్రత్తపడుతూ ప్రతిపక్ష నేతపై దారుణమైన రీతిలో అన్యాయపు ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లింది. జగన్ పై కేసులు ఉంటే ఆయన ఎదుర్కుంటున్నారు.కాని చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తున్నది అందరికి తెలుసు. ఇవన్ని ఒక్ ఎత్తు అయితే ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలు మాఫియాలు గా మారి జనాన్ని వేదిస్తున్న విషయాలు తెలియనివా?అందువల్ల ఎపిలో ఐదేళ్ల పాలన ఎంత అరాచకంగా సాగింది అర్దం అవుతూనే ఉంది.దానిని కప్పిపుచ్చుకోవాడానికి చంద్రబాబు ఈ ఎదురుదాడి.ప్రజలు ఎల్లకాలం మోసపోతారా?

tags : ap, politics

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info