A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
Share |
June 25 2019, 1:10 pm

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా మ‌న‌ ద‌గ్గ‌ర న‌వ‌ర‌త్నాలు లేవు. ముఖ్య‌మంత్రి
చంద్ర‌బాబు గారిలా గాల్లో మేడ‌లు క‌ట్టే హామీలు ఇవ్వ‌ను. జ‌న‌సేన పార్టీ అమ‌లు
చేయ‌గ‌లిగే హామీల‌ను మాత్ర‌మే ఇస్తుంది అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ఎన్నికల ప్రచార సభలలో ఆయన మాట్లాడారు. 2019లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువ‌త భ‌విష్య‌త్త‌కు ప్రాధాన్యం ఇస్తాం. స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్
జోన్లు ఏర్పాటు చేసి ల‌క్ష‌మంది యువ‌రైతుల‌ను త‌యారు చేస్తాం. 3 ల‌క్ష‌ల బ్యాక్
లాగ్ పోస్టుల‌ను ఆరు నెల‌ల్లో భ‌ర్తీ చేస్తాం. పోలీస్ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను
భ‌ర్తీ చేయ‌డంతో పాటు బ‌ల‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కోసం 25వేల మందితో స్పెష‌ల్
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేస్తాం. రాష్ట్రంలో మూత‌ప‌డ్డ స‌హ‌కార
రంగంలో ఉన్న అన్ని మిల్లుల‌ను తెరిపిస్తాం. ప‌రిశ్ర‌మ‌ల ఆస్తులు రాజ‌కీయ నాయ‌కులు
దోచేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాం. ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన
మ‌రుక్ష‌ణ‌మే నా మొద‌టి సంత‌కాన్ని రైతుల‌కి నెల‌కి రూ. 5 వేల ఫించ‌న్ ఇచ్చే ప‌థ‌కం మీద పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నా. దీంతో పాటు ఎలాంటి హామీ ప‌త్రాలు లేకుండా
రైతులంద‌రికీ ఏడాదికి ఎక‌రానికి రూ. 8 వేల చొప్పున సాగు సాయం అంద‌చేస్తాం. కుటుంబ
స‌భ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్
అందించే ప‌థ‌కం మీద రెండో సంత‌కం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి ప‌ది సిలిండ‌ర్లు ఉచితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం అంద‌చేస్తుంది. త‌దుప‌రి సంత‌కం రేష‌న్ బియ్యం, ప‌నికిరాని
పామాయిల్‌తో ఇబ్బందులు ప‌డుతున్న మీ కోసం రేష‌న్‌కి బ‌దులు రూ. 2500 నుంచి రూ. 3500 వంద‌లు మ‌హిళ‌ల ఖాతాల‌కి జ‌మ చేసే ప‌థ‌కంపై పెడ‌తానని హామీ ఇచ్చారు. నా తండ్రి వార‌స‌త్వంగా వేల‌కోట్లు, వేల ఎక‌రాలు ఇవ్వ‌లేదు. కుదిరితే 10 మందికి మంచి చేయ‌మ‌ని,ధ‌ర్మంగా బ‌త‌క‌మ‌ని చెప్పారు. మీకు ఓటుకు డ‌బ్బులు ఇవ్వ‌లేను కానీ.. మీ భ‌విష్య‌త్తు కోసం నా భ‌విష్య‌త్త‌ను ప‌ణంగా పెడ‌తాను. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

tags : pawankalyan, promises

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info