A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
Share |
June 25 2019, 10:01 pm

భీమ‌వ‌రం, గాజువాక శాస‌న‌స‌భ స్థానాల నుంచి త‌న‌ను ఓడించ‌డానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ,తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుట్ర‌లు చేస్తున్నాయ‌ని, ఆ కుట్ర‌ల‌ను
తుత్తునీయ‌లు చేసి భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌క‌పోతే నా పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్
నే కాద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌వాల్ చేశారు.
వేల‌కోట్లు వెదజల్లినా, కిరాయి మూక‌లు వచ్చినా విజ‌యం మాత్రం జ‌న‌సేన‌దే అన్నారు.
మీరు దెబ్బ‌కొడితే ప‌డ‌టానికి ఇది 2009 కాదు 2019 గుర్తుంచుకోండ‌ని హెచ్చ‌రించారు.
ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా గుంటూరు జిల్లా వేమూరు
నియోజకవర్గ కేంద్రంలో బ‌హిరంగస‌భ లో ప్రసంగించారు.తీసుకురావాల‌ని 2009లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపిస్తే.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో పార్టీని విచ్ఛిన్నం చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా నిలిచింది. టికెట్లు అమ్ముకున్నాం, కోట్లు కూడ‌బెట్టుకున్నాం అని పేప‌ర్లు, టీవీల్లో
ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించారు. నిజానికి ప్ర‌జారాజ్యం పార్టీలో
అత్య‌ధికంగా బీసీల‌కు టికెట్లు ఇచ్చాం. అత్యంత వెనుక‌బ‌డిన జాతిగా చెప్పుకొనే
యానాదుల జాతి నుంచి శ్రీమ‌తి తుపాకుల మునెమ్మ‌లాంటి వారిని ఎమ్మెల్యే
అభ్యర్థిగా నిల‌బెట్టాం. అలాంటి ఆశ‌యాల‌తో ముందుకెళ్తే టికెట్లు
అమ్మేసుకున్నార‌ని గ్లోబెల్ ప్ర‌చారం చేశారు. ఎందుకంటే వైఎస్, చంద్ర‌బాబు కుటుంబాల
నుంచి త‌ప్ప మూడో వ్య‌క్తి రాజ‌కీయం చేయ‌డం వాళ్ల‌కు ఇష్టంలేకే ప్ర‌జారాజ్యంపై
దుష్ప్ర‌చారం చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే రాజ‌కీయ ఆట జ‌న‌సేన పార్టీతో ఆడాల‌ని ఆ
రెండు కుటుంబాలు చూస్తున్నాయి. చంద్రబాబు, జగన్ ల మధ్యనే రాజకీయం ఉండాలా? అయితే
వారికి తెలియాల్సింది రోజులు మారాయి, కొత్త‌ర‌క్తం రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది.
కాన్షీరాం స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌వాడిని, ప‌వ‌న్ క‌ళ్యాణ్
ప్రాణ‌మ‌న్నా పోవాలి లేదంటే బ‌ల‌మైన సామాజిక మార్పు అన్న జ‌ర‌గాలి త‌ప్ప వెన‌క‌డుగు
వేయ‌డు. ఇంత వ‌ర‌కు కులాల‌ను విడ‌దీసి రాజ‌కీయం చేశారు. ఇప్పుడు కులాల‌ను క‌లిసే రాజ‌కీయంజ‌న‌సేన చేస్తుంది. అని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
*కోమటిరెడ్డి విషయం చెప్పేశారు
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*ప్రజా వేదిక కూల్చివేత ఆరంబం
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info