A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
Share |
April 22 2019, 12:24 am

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజదాని చేస్తామని ,కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంటున్నారు.ఆయన మల్కాజిగిరి లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మల్కాజిగిరి స్థానం నుంచి తాను గెలిస్తే ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెడతానని చెప్పారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పిస్తాని ఆయన అన్నారు.సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి రెండో రాజధాని తప్పనిసరని.. అది కూడా హైదరాబాద్ రాజధానిగా చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు. నిజానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ హైదరాబాద్‌ దేశానికి రాజధానిగా స్వాతంత్య్రానికి పూర్వమే ప్రతిపాదించారని ఆయన అన్నారు. అదేదో కాంగ్రెస్ ఎన్నికల మానిపెస్టోలో పెట్టిస్తే బెటర్ కదా!

tags : revanth, capital

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info