A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
Share |
April 20 2019, 2:39 am

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల 2014 లో తెలంగాణలో కాంగ్రెస్ అదికారంలోకి రాలేకపోయందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేంద్రంంలో జరిగిన సంగతులు ఆయన వివరించారు.
తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యేది కాదని వెల్లడించారు. ముకేశ్‌ అంబానీకి రూ. 7వేల కోట్ల జరిమానా విధించిన ఏకైక కేంద్ర మంత్రినని అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సిద్దిపేటలో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్‌ 24 గంటలకే ముగించేశారని అన్నారు. ఖమ్మం దీక్ష సందర్భంగా నిమ్స్‌లో చేరి రోజుకు 750 కేలరీల ద్రవాహారం తీసుకున్నారని, అలా చేస్తే ఏళ్ల తరబడి జీవించవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అవరోధం కలుగుతుందని.. ఆయన చేసిన మోసాలు, దొంగ దీక్షల రహస్యాలు సోనియమ్మకు చెప్పలేదని అన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు, విద్యార్థులకు ఫీజులు లేవని, కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రానుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ డబ్బులున్న అభ్యర్థులకు గాలం వేసి టికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు.

tags : jaipalreddy, sonia,secrets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info