A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇదా పవన్ కళ్యాణ్ కోరుకునే మార్చు..ప్చ్..
Share |
June 25 2019, 1:11 pm

మార్పు కోసం రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులనే కాదు..నాబోటి వాళ్లను కూడా నిరాశపర్చారు.పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా దిగజారి మాట్లాడతారని మాబోటి వాళ్లం ఊహించలేకపోయాం.ఏకంగా ఆయన కూడా తెలంగాణ,ఎపి ప్రజల మద్య చిచ్చు పెట్టి లాభపడాలని చేస్తున్న ప్రయత్నం గమనిస్తే చాలా మంది నేతలు చెడిపోవడానికి చాలా ఏళ్లు పట్టింది.కాని పవన్ కల్యాణ్ మాత్రం ఇలా కొన్ని నెలల్లోనే పాడైపోతారని ఊహించలేదు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అంటే అబద్దాలు, మోసాలు ఆరితేరిన వ్యక్తి అని ప్రత్యర్దులంతా చెబుతారు. కాని పవన్ కళ్యాణ్ ను అలా ఎవరూ అనుకోలేదు.అనలేదు కూడా.ఏమైనా పెయిర్ రాజకీయాలు చేస్తారేమోలే అని చాలామంది ఆశించారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో కారణం ఏమైనా తన పార్టీని పోటీలో పెట్టకుండా తెలుగుదేశం, బిజెపిలకు మద్దతు ఇచ్చారు. ఆయన చెగువేరా వంటి విప్లవకారుల అబిమానినని చెప్పుకున్నా, అందుకు పూర్తి విరుద్దంగా అప్పుడే వ్యవహరించినా, ఆంద్ర రాజకీయాలలో చెగువేరాలను తీసుకు రాలేం కదా అని సరిపెట్టుకున్నాం.ఆయన అభిమానులు కూడా ఆయన పార్టీ పోటీచేయడం లేదని బాదపడ్డా, ఆయన చెప్పినట్లు తెలుగుదేశం కు ఓటు వేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన ప్రశ్నిస్తారని అనుకుంటే పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప. నిరాహార దీక్షలు చేస్తానని,అది చేస్తానని ఇది చెస్తానని చెప్పినా, సినిమా నటుడు కదా ఆయనకు ఇబ్బంది ఉండవచ్చులే అని సరిపెట్టుకున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో ఆ వర్గానికి తీవ్రమైన అవమానాలు ఎదురైనప్పుడు ,వారు జైళ్లపాలైనప్పుడు,ముద్రగడ కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టిన వీడియోలు బయటకు వచ్చినప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రస్ తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు బాదపడ్డాయి.కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఖండించిన దాఖలా లేదు. అయినా ఆయన అభిమానులు మన నేత ఒక కాపుకులం పేరుతో మద్దతు ఇవ్వలేరులే అని సరిపెట్టుకున్నారు. గత ఏడాది గుంటూరు వద్ద ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన, ఆయన ప్రభుత్వంపైన, చంద్రబాబు కుమారుడు లోకేష్ పైన సంచలన అవినీతి ఆరోపణలు చేసి ఒక్కసారిగా తన గ్రాఫ్ పెంచుకున్నారు. నిజంగానే దానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం చేసుకోగలిగి ఉంటే,ఎపిలో కొత్త రాజకీయానికి ఆస్కారం ఉండేది.అదికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో పాటు జనసేన పోటాపోటీగా ముందుకు వచ్చేది.కాని ఎందువల్లో పవన్ కళ్యాణ్ ఆ పని చేయలేకపోయారు.ఆ తర్వాత పోరాట యాత్రలో టిడిపి ప్రతి నియోజకవర్గంలో పాతిక కోట్లు ఖర్చు పెట్టబోతోందని చెప్పి మరో సంచలనం సృష్టించారు.ఎన్నికల దగ్గరపడే కొద్ది పవన్ కళ్యాణ్ ఇక చంద్రబాబును, టిడిపి ప్రభుత్వాన్ని ఏకీ పారేస్తారని అనుకున్నారు.కాని ఆశ్చర్యంగా ఎన్నికల వచ్చిన తర్వాత పవన్ స్వరం మారిపోయింది.ఆంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును బదులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించడం ఆరంభించారు. లేదా ఎపి ప్రతిపక్ష నేత జగన్ ను విమర్శించసాగారు.అదే సమయంలో తెలుగుదేశంలోకి వెళ్లాలని అనుకున్న మాజీపోలీసు అదికారి వివి లక్ష్మీనారాయణను చంద్రబాబు సూచన మేరకు జనసేనలో చేర్చుకున్నారన్న వార్త వచ్చింది.దాంతో మరిన్ని అనుమానాలకు దారి తీసింది.అయినా ఫర్వాలేదు.కాని ఇప్పుడుఏకంగా ఆంద్ర,తెలంగాణ ప్రజల మద్య చిచ్చు పెట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.హైదరాబాద్ పదేళ్ల రాజధానిగా ఉండే హక్కు ఆంద్రులకు ఉంటే ఎందుకు చంద్రబాబు పారిపోయి విజయవాడ వెళ్లారని పవన్ అడగడం లేదు? పవన్ చెబుతున్నట్లు నిజంగానే హైదరాబాద్ లో ఆంద్రులకు ఇబ్బంది కలుగుతుంటే చంద్రబాబు ఇక్కడ ఉండి సెక్షన్ ఎనిమిది అమలుకు ప్రయత్నించడం లేదని అడగడం లేదు?నిజంగానే ఆంద్రులకు హైదరాబాద్ లో ఇబ్బంది వచ్చిందా?లేదా అన్నది వేరే చర్చ.నిజంగానే ఆ పరిస్థితి ఉంటే స్వయంగా ఆయన సోదరుడు నాగబాబు టిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేశారు?ఇప్పుడు ఆయన నరసాపురం లో ఎమ్.పిగా పోటీచేస్తున్నారు కదా..ఆయనతో దానిపై వివరణ ఇప్పిస్తారా?అంతేకాదు.కెసిఆర్ ను ఆయా సందర్భాలలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు కలిశారు కాని జగన్ అసలు కలవనేలేదు.కెసిఆర్ తో పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అలాగే కెసిఆర్ ను ఆకాశానికి ఎత్తుతూ పొగిడింది పవన్ కళ్యాణ్ .అప్పుడు చంద్రబాబుకు,పవన్ కళ్యాణ్ కు పౌరుషం లేనట్లా?రోషం లేనట్లా?ముందు దానికి సమాదానం చెప్పకుండా ఆంద్ర ప్రజలు అమాయకులని,పిచ్చి వాళ్లని వీళ్లిదరూ భావించి రెచ్చగొట్టి ఓట్లు పొందాలన్న కుటిల యత్నం చేయడం మాత్రం దుర్మార్గం అని చెప్పాలి.కొత్తగారాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ,రాజకీయాలలో ముదిరిపోయిన చంద్రబాబును నమ్ముకుని ఆయన చెప్పినట్లు ఆడుతున్నారన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తే పోయేది పవన్ కళ్యాణ్ పరువే. కనుక తన అన్న నాగబాబు ఎందుకు టిఆర్ఎస్ కు ఓటు వేసింది.తాను ఎందుకు కెసిఆర్ ను పొగిడింది వివరించి,ఆ తర్వాత ఇంకేదైనా మాట్లాడండి.ప్రజలను పిచ్చివాళ్లగా భావించవద్దని పవన్ కళ్యాణ్ కు సవినయంగా మనవి చేయడం తప్ప ఏమి చేయగలం.అయతే ఇదేనా పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు అన్న బాద కలుగుతుంది.

tags : pawankalyan

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info