A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
Share |
April 20 2019, 2:18 am

ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. దీంతో భువనగిరి లోక్‌సభ సీటును ఎలాగైనా గెల వాలని వారు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ ఆరోపించారు.ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదనే బాధతోనే కాంగ్రెస్‌ పార్టీ, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్యగౌడ్‌ వెల్లడించారు.కోమటిరెడ్డి సోదరుల కారణంగానే ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు సార్లు ఓటమి పాలయ్యానని.. తన ఉసురు వారికి తగులుతుందని భిక్షమయ్యగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సామాజిక న్యాయం పాటిస్తూ నల్లగొండలో ఓసీ, భువనగిరిలో బీసీకి టికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తన అనుచరులతో కలసి రెండు, మూడ్రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

tags : congress, goodbye

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info