A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
Share |
April 20 2019, 2:06 am

జనసేన ఎపి రాజకీయాలలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు కులవిద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా ఎన్నికల సభల్లో మాట్లాడుతూంటే.. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బహిరంగసభల్లో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని అన్నారు. జనసేన రాజకీయాల్లోకి కొత్త ట్రెండ్‌ను పాటిస్తోందని, ప్రతిపక్షంగా ఉంటూ అధికారపక్షాన్ని పల్లెత్తుమాట అనట్లేదని దుయ్యబట్టారు. అధికారపక్షంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని కువిమర్శలు చేస్తోందన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన పవన్‌.. టీడీపీకి అండగా ఉన్నారని ధ్వజమెత్తారు. భీమవరం సభలో పవన్‌ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆంధ్ర ప్రజల భూములను లాక్కుంటున్నారని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
పవన్‌ ఒక ఊసరవెల్లిగా మాట్లాడుతున్నారని, పూటకోమాట మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల తరువాత కేసీఆర్‌ను పవన్‌ అభినందించారని, ప్రజల హృదయాల్ని దోచుకున్న వ్యక్తిగా ప్రస్తుతించారని, ఇప్పుడదే నోటితో ఆంధ్రాలో కేసీఆర్‌ను విమర్శిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

tags : botsa, janasena,trend

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info