A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
Share |
June 20 2019, 9:00 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,జనసేన అదినేత పవన్ కల్యాణ్ లు కోడ్ ఉల్లంగించి ఉపన్యాసాలు చేస్తున్నారని, అభ్యంతరకర భాష వాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు ఎమ్.వి.ఎస్.నాగిరెడ్డి,గౌతం రెడ్డిలు ఎన్నికల ముఖ్య అదికారికి దీనిపై పిర్యాదు చేశారు.'వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే రౌడీ రాజ్యమే అంటూ ఈ నెల 22న విజయనగరం జిల్లా సాలూరులో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. అదే విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అర్బన్‌ ఫ్యాక్షన్ పార్టీగా అభివర్ణించారు. అది పత్రికలలో ప్రధానంగా ప్రచురించబడింది. ఏదైనా పార్టీలు పలానా పార్టీకి ఓటు వేయవద్దని ఓటర్లను బెదిరించడం వంటివి చేయకూడదు. అలాంటిది చంద్రబాబు సభలో ప్రసంగిస్తూ వైఎస్సార్‌సీపీకి ఓటు వేయవద్దని, కేవలం టీడీపీకి మాత్రమే ఓటు వేయమని కోరారు. అది ఎన్నికల నిబంధన ఉల్లంఘించడమే.చంద్రబాబు ఈ నెల 22న విశాఖపట్నం జిల్లాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ ఓటర్లు వైఎస్సార్‌సీపీని ఎంపిక చేసుకుంటే వారి మరణ వాగ్మూలాలు వారే రాసుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. ఇది కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పు. ఈ నెల 21న విశాఖపట్నం జిల్లా గాజువాక ర్యాలీలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి అవకాశం ఇస్తే భూకబ్జాలకు అవకాశం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది ఓటర్లను బెదిరించడం కిందకు వస్తుంది. వైఎస్‌ జగన్‌కు ఓటు వేస్తే మోదీకి ఓట్లు వేసినట్టే అంటూ కరపత్రాలు ముద్రించి టీడీపీ పలుచోట్ల పంపిణీ చేస్తోంది. ముస్లిం ఓటర్లలోఅనుమానాలు రేకెత్తించాలనే దురుద్దేశ్యంతో వీటీని పంపిణీ చేసిందని" వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

tags : ysr congress,

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info