A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
Share |
April 20 2019, 2:38 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ,చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ కు మంత్రి వదవి ఇస్తామని పార్టీ అదినేత జగన్ హామీ ఇచ్చారు. చిలకలూరిపేటలో బిసి మహిళ కోసం తాను మర్రి రాజశేఖర్ ను త్యాగం చేయాలని కోరానని,అడిగిన వెంటనే రాజశేఖర్ ఎలాంటి సంకోచం లేకుండా ఆయన అంగీకరించారని జగన్ చెప్పారు. చిలకలూరిపేట ప్రజలకు ఒక హామీ ఇస్తున్నా..వైసిపి అభ్యర్ధి విడదల రజనీని గెలిపించండి..మనందరి ప్రభుత్వం వచ్చాక రాజశేఖర్ అన్నను మంత్రిని చేస్తా..అని ఆయన సభికుల హర్షద్వానాల మద్య ప్రకటించారు. చిలకలూరిపేటకు సంబందించి పలు సమస్యలను ఎమ్.పి అభ్యర్ది కృష్ణదేవరాయులు ప్రస్తావించగా, వాటిని తీర్చుతామని జగన్ హామీ ఇచ్చారు.

tags : jagan, marri,minister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info