A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
Share |
April 20 2019, 2:25 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వాదనలు చిత్రంగానే ఉన్నాయి. తెలంగాణలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎందుకు పోటీచేయడం లేదని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో జనసేన పోటీచేయని విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు. 2014 ఎన్నికలలో అసలే పోటీచేయలేదు.ఇప్పుడు రెండు,మూడు చోట్ల అభ్యర్దులను ప్రకటించి, వైసిపి ఎందుకు పోటీచేయడం లేదని అంటున్నారు.ఇదే జగన్,కెసిఆర్ ల కుమ్మక్కు అని ఉదాహరణ అని ఆయన అన్నారు.ఎపి రాజకీయాలతో కెసిఆర్ కు ఏమి సంబందం అని ఆయన అన్నారు."చంద్రబాబుకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేయండి. ప్రజాస్వామ్య బద్ధంగా పోటీ చేస్తే మాకు ఇబ్బంది లేదు. నేరస్తులకు కొమ్ముకాసే టీడీపీకి మేం మద్దతివ్వాలా?. చంద్రబాబు, కేసీఆర్‌ గొడవలను ఏపీ, తెలంగాణ గొడవలుగా మార్చరాదని ఆయన అన్నారు. పవన్ వాదనలు తమాషాగానే ఉంటున్నాయి.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info