A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
Share |
June 20 2019, 9:38 pm

నరసరావుపేట లోక్ సబ నియోజకవర్గ టిడిపి అబ్యర్ది ,ఎమ్.పి రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు బకాయిపడ్డ వ్యవహారం ఇప్పుడు ఆయన కు పెద్ద చిక్కుగా మారింది. ఆయన ఆస్తులు వేలంపాటకు వస్తున్నాయని వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఆంధ్రా బ్యాంక్‌ తాజాగా వేలం ప్రకటన జారీ చేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–7లో ఉన్న జీ+3 వాణిజ్య భవనాన్ని 25/04/2019న వేలం వేస్తున్నట్లు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. 631 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్‌ కనీస ధరను రూ.7,36,14,000గా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు ధరావత్తు కింద రూ.73,61,400 జమ చేయాల్సి ఉంటుంది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ మార్చి 20 నాటికి రూ.748.77 కోట్లు రుణాలు బకాయి ఉండటంతో కంపెనీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ఆ ప్రకటనలో తెలియచేసింది.ఈ రుణానికి గ్యారంటర్లుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారులు రాయపాటి రంగారావు, కుమార్తెలు దేవికారాణి, లక్ష్మీలతోపాటు మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్లకుపైగా రుణాలను తీసుకుని ఎగ్గొట్టింది.

tags : rayapati

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info