A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
Share |
April 20 2019, 2:00 am

నా జీవితం తెరచిన పుస్తకం. అంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున మనుషులు, టిడిపి వాళ్లు తనపై రకరకాల ప్రచారం చేస్తున్నారని, కాని తన జీవితం తెరచిన పుస్తకం అని ఆయన అన్నారు. చంద్రబాబు వసూలు చేసిన వేల కోట్ల రూపాయలు గురించి లెక్కలు చెప్పగలరా అని ఆయన సవాల్ చేశారు. ట్విటర్ లో ఆయన స్పందించారు.ఆ విషయాలు ఇలా ఉన్నాయి.
‘నా జీవితం తెరచిన పుస్తకం. నీది అవినీతి చరిత్ర. ఎనీటైం.. ఎనీ ప్లేస్‌.. నువ్వే నేరుగా నాతో చర్చకు రా.. నిజానికి నా స్థాయికి నువ్వు తగవు. మాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా? 2013 సంవత్సరంలో అధికారంలో లేని చంద్రబాబును నా విద్యాసంస్థలకు తీసుకొచ్చాను. నా ఫంక్షన్స్‌, సినిమా ఓపనింగ్స్‌ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. కావాలంటే ఇంటర్నెట్‌లో చూసుకోండి. ట్విటర్‌, యూట్యూబుల్లో అవి వసూలు చేశావ్‌.. ఇవి వసూల్‌ చేశావ్‌ అంటూ నీ తరఫున కొంతమంది వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన వసూళ్ల గురించి కూడా వాళ్లను చెప్పమను. మాకు ఇచ్చిన విరాళాలకు లెక్కలున్నాయి. మరి నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలున్నాయా? నీ అడుగులకు మడుగులొత్తితే సైలెంట్‌గా ఉంటావ్‌. లేకపోతే లేనిదానిని ఉన్నట్టుగా అపనిందలు వేయిస్తావా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పదవులు ఉంటాయి పోతాయి. డబ్బు సంపాదన ఎంతవరకు జాగ్రత్త.. అన్న ఎన్టీఆర్‌కు ఏమీ చేశావో అవన్నీ చెబితే బాగుండదు. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చెయ్యగలవు. అది నన్ను చంపించడం అంతే. అంతకంటే ఏమీ చెయ్యలేవు. జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు.

నా జీవితం తెరచి ఉన్న పుస్తకం. అందులోని ప్రతి పేజీ, ప్రతి పేరా,ప్రతి వాక్యం, ప్రతి అక్షరమూ ఎవ్వరైనా చదువుకోవచ్చు. కానీ నీ జీవితం మూసి ఉన్న పస్తకం. అది తెరిస్తే ఏ అవినీతి బయటపడుతుందో అని నువ్వు వణికిపోతున్నావ్‌. నీ మోచీతి నీళ్లు తాగేవాళ్లు కాదు.. నువ్వు నేనే. ఎనీటైమ్‌, ఎనీ ప్లేస్‌, ఎనీ వేర్‌ చర్చకు సిద్ధం. తెలగుదేశం తమ్ముళ్లూ.. మీలో కూడా నన్ను అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు కూడా పార్టీలో ఎందుకున్నారంటే అన్నయ్య మీద ఉన్న ప్రేమతో. అది మీ అభిమానం. నేను కాదనను. ఇక వద్దు మొదలుపెడితే చాలా దూరం పోతుంది. నాకు, నా కుటుంబానికి, నా విద్యాసంస్థలకు ఏమి జరిగినా దానికి అతడే (చంద్రబాబు) కారణం’ అని పేర్కొన్నారు.

tags : mohan babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info