A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
Share |
April 20 2019, 2:01 am

అధికారికంగా జరిగే తప్పులు ఒక్కోసారి నేతలను ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు,మంత్రి లోకేష్ ల నామినేషన్ లలో దొర్లిన పొరపాట్లు అందరికి నవ్వు తెప్పిస్తున్నాయి. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు, మంగళగిరి అభ్యర్థి లోకేశ్‌లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలియజేస్తూ అధికారిక పత్రాన్ని నామినేషన్‌ పత్రాలతో అందచేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసిస్తున్న వారు అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం మంజూరుచేసిన పత్రాలలో తండ్రి అనే కాలమ్‌ వద్ద భర్త అని ఆంగ్లంలో ఉంది. దీన్ని గమనించకుండానే అధికారులు సంతకం చేసేశారు. చంద్రబాబునాయుడు నారా, భర్త ఖర్జూరనాయుడు నారా అని ఒక పత్రంలో, లోకేశ్‌ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని మరో పత్రంలో ఉన్న పొరపాటు అధికారుల దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వారు స్పందించి సంబంధిత ధ్రువపత్రాలను మళ్లీ మంజూరు చేశారు.దీనివల్ల నామినేషన్ల ఆమోదానికి ఇబ్బంది లేదని అదికారులు చెప్పారు.

tags : chadnrabau, lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info