A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
Share |
April 20 2019, 2:02 am

ధర్మ రాజుకు ధర్మం తానే చెప్పినట్లు, హరిశ్చంద్రుడుకు నిజాలు తానే నేర్పినట్లు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తుంటారని, మరో వైపు అబద్దాలు చెప్పడంలో రికార్డు సాదిస్తుంటారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు. పాడేరు లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మీ భవిష్యత్తు- నా బాద్యత అని చంద్రబాబు అంటున్నారని, ఎవరైనా నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై టీవీలలో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారని,మనం చంద్రబాబుతోనే కాకుండా,ఈనాడు,జ్యోతి,టివి 5 లతో పోరాడుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ ఒన్ చేశానని చెబుతున్నారని, రైతుల రుణమాఫీ,డ్వాక్రా రుణాల మాఫీలలో వారిని మోసం చేయడంలో నెంబర్ ఒన్ గా చేశారని జగన్ అన్నారు. పీజ్ రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పిల్లలను కూడా మోసంచేయడంలో నెంబర్ ఒన్ గా ఉన్నారని ,ఇలా అబద్దాలలో,మోసాలలో రాష్ట్రాన్ని నెంబర్ ఒన్ చేశారని జగన్ ద్వజమెత్తారు.

tags : jagan,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info