A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
Share |
April 20 2019, 1:43 am

తెలంగాణలో సిపిఐ మద్దతు కోసం కాంగ్రస్ ప్రయత్నిస్తోంది.గత ఎన్నికలలో కూటమిగా ఏర్పడి పోటీచేసినా,ఓటమి తర్వాత ఎవరి దోవ వారిదిగా ఉంది.అయితే తాజాగా
లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీచేయని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతి యా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్లో సంప్రదించినట్టు సమాచార వచ్చింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీచేయడం, మిగతా చోట్ల టీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు మద్దతు ఇవ్వడం అనే అంశాలపై నిర్ణయం జాతీయనాయకత్వ పరిధిలో ఉందని చాడ వారికి వెల్లడించినట్టు తెలుస్తోంది.

tags : cpi,congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info